గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రి వద్ద 16 ఫీట్ల ఎత్తులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కొవిడ్‌ సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యద్భుత సేవలందించారు.  అక్టోబర్‌ 2న ఉదయం 10 గంటలకు గాంధీ విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.