మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలి : కేసీఆర్

మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలి : కేసీఆర్

టీఆర్‌ఎస్‌ వేసే ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌  మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్‌ సిన్హాకు నా హృదయపూర్వక స్వాగతం అన్నారు. యశ్వంత్‌ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు.  భారత రాజకీయాల్లో యశ్వంత్‌ సిన్హాది కీలక పాత్ర. ఆయన అన్ని రంగాల్లో విశేష అనుభవ ఉందన్నారు. మంత్రిగా దేశానికి అనేక సేవలు చేశారు. న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా ఉత్తమ సేవలు అందించారు. ఆత్మప్రభోదానుసారం రాస్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి. అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది అని సీఎం అన్నారు.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :