టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ : సీఎం కేసీఆర్

టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ : సీఎం కేసీఆర్

టీ హబ్‌ నేషనల్‌ రోల్‌ మోడల్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. టీ హబ్‌ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. టీ హబ్‌-2 ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ టీ హబ్‌ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలోనే యువ భారత్‌ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. 2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడిరచారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్‌ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీహబ్‌ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని తెలిపారు. టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు టీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అధికారులను అభినందించారు.

దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్‌ కంపెనీలకు టీ హబ్‌ ఉతమిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ను స్టార్టప్‌ క్యాపిటల్‌గా రూపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో హైదరాబాద్‌ ఉత్తమ నగరమని తెలిపారు. తెలంగాణ స్టార్టప్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియాగా ఉండబోతుందన్నారు. యువ వ్యాపారవేత్తలకు తయారు చేయడమే టీ హబ్‌ లక్ష్యమని వెల్లడిరచారు.  స్టార్టప్‌లకు ప్రభుత్వమే ప్రోత్సహించడం తెలంగాణలోనే ప్రారంభమైందన్నారు. స్టార్టప్‌ల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయన్నారు. టీ హబ్‌లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రారంభించాయని పేర్కొన్నారు. సక్సెపుల్‌ స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

 

Tags :