భూ వివాదాలు లేకుండా చూడంది - జగన్

భూ వివాదాలు లేకుండా చూడంది - జగన్

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగానే రికార్డుల్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా, తక్కువ రుసుముతో చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా భూ వ్యవహారాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పారదర్శక విధానాలు అమలు చేయాలని,  వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఉండాలని నిర్దేశించారు. 

 

Tags :