సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ ఆహ్వానం

సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ ఆహ్వానం

తిరుపతిలోని పేరూరుబండపై నిర్మించిన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి కార్యనిర్వాహక అధికారి (ఇఒ) ఎవి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆహానపత్రాన్ని జగన్‌కు అందజేశారు. ఈ నెల 23న విగ్రహా ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు.

 

Tags :