అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన తొలి విడతగా 100 క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. పంద్రాగస్టున కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడిరది. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
Tags :