విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన 'చిత్తం మహారాణి' టీజర్

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. రొమాంటిక్ కామెడీగా చిత్తం మహారాణి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రష్మిక మందన విడుదల చేసిన లిరికల్ సాంగ్ కు కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన JS మణికంఠ మాట్లాడుతూ.. 'మేము నిర్మించిన చిత్తం మహారాణి సినిమా అద్భుతంగా వచ్చింది. కథా కథనాలు చాలా బాగా కుదిరాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే అంశాలు మా సినిమాలో చాలా ఉన్నాయి. కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాము' అని తెలిపారు.