81 వసంతాలను పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ : చిరంజీవి బర్త్ డే విషెష్

81 వసంతాలను పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ : చిరంజీవి బర్త్ డే విషెష్

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు నేడు (జ‌న‌వ‌రి 20). 81 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.
‘‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబల్ స్టార్. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగు పెట్టిన రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజుగారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో అహ్లాదంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అని విషెష్ తెలిపారు చిరంజీవి.

చిరంజీవి కెరీర్ ప్రారంభంలో కృష్ణంరాజుతో క‌లిసి ‘మనవూరి పాండవులు’ సినిమాలో నటించారు. అందులో కృష్ణంరాజు కృష్ణుడిలాంటి పాత్ర‌ను పోషిస్తే.. చిరంజీవి అర్జునుడి లాంటి పాత్ర‌లో క‌నిపించారు.

కృష్ణంరాజు సినిమాల్లో న‌టించ‌డం లేదు. రీసెంట్‌గా త‌న న‌ట వార‌సుడు ప్ర‌భాస్ న‌టించిన ‘రాధే శ్యామ్’ చిత్రంలో స్వామిజీ పాత్రలో నటించారు కృష్ణంరాజు. ఈ సినిమా ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కావాల్సింది కానీ.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది.

 

Tags :