జీ 20 సదస్సు ఎందుకు ? : చింతామోహన్

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే జీ20 సదస్సు ఎందుకు? పేదవాళ్ల ఆకలి తీర్చడానికా, కన్నీళ్లు తుడవడానికా? అని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేతనైతే నిరుద్యోగ సమస్య తీర్చాలన్నారు. జీఎస్టీ, పెరుగుతున్న ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎనిమిదన్నరేళ్లో ఏం చేసిందని నిలదీశారు. మూడున్నర ఏళ్లలో వైసీపీ ఏం చేసింది? దమ్ముంటే డిడెట్‌కు వారాలని సవాల్ విసారు. జీ 20 సదస్సుకు పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకుంటూ వెళ్లబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







Tags :