MKOne Telugu Times Youtube Channel

జీ 20 సదస్సుకు మేము దూరం

జీ 20 సదస్సుకు మేము దూరం

జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న జీ20 సదస్సుకు తాము హాజరు కావడం లేదని చైనా ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలను జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  శ్రీనగర్‌లో మే 22, 23, 24 తేదీల్లో జరగనున్న జీ 20 సదస్సు కోసం భద్రతాదళాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. స్థానిక షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటరులో పర్యాటక రంగంపై జీ20  వర్కింగ్‌ గ్రూపు మూడో సదస్సు జరగనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. 

 

 

Tags :