ASBL NSL Infratech
facebook whatsapp X

బెజవాడకు వరదలు.. చంద్రబాబు చేసిన తప్పేంటి..?

బెజవాడకు వరదలు.. చంద్రబాబు చేసిన తప్పేంటి..?

ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ ఇప్పుడు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మూడు రోజులుగా విజయవాడలోని మెజారిటీ ప్రాంతాలు నీటిలోనే గడుపుతున్నాయి. వానలు, వరదలు అంటే సహజంగా దృష్టంతా కృష్ణానదిపైనే ఉంటుంది అందరికీ.! కానీ ఈసారి కృష్ణానది వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా బుడమేరు విరుచుకుపడింది. దీంతో ఎవరికీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. విపత్తులను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన చంద్రబాబు ఈసారి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారనే టాక్ నడుస్తోంది.

సంక్షోభాలను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. రాత్రింబవళ్లూ ఆయనే రంగంలోకి దిగి అధికారులను పరుగులు పెట్టిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన కార్యక్షేత్రంలోనే ఉన్నారు. ఆగస్టు 31నాటికి వరద ఉధృతమైంది. ఆరోజు నుంచే బెజవాడకు వరద ముంపు మొదలైంది. తెల్లారేసరికి సీన్ అర్థమైపోయింది. మధ్యాహ్నం తర్వాత అది మరింత ఉధృతమైంది. సాయంత్రానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. కృష్ణా కలెక్టరేట్ నుంచే పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే నాలుగు రోజులైనా కూడా పరిస్థితి ఇంకా కుదుటపడలేదు.

చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు టీంకు గైడ్ చేస్తున్నారు. అయినా ఎక్కడో ఏదో సమన్వయ లోపం కనిపిస్తోంది. అధికారులు సక్రమంగా పని చేయట్లేదని.. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని రోజూ చంద్రబాబు చెప్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ప్రభుత్వ ఆదేశాలు, సహాయక చర్యలు క్షేత్రస్థాయిలోకి వెళ్లట్లేదు. అందుకే ఇప్పటీ లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీటికోసం అలమటిస్తున్నారు. మరోవైపు కుప్పలు తెప్పలుగా తిండి బెజవాడకు వస్తోంది. కానీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది.

బెజవాడలో అధికారులంతా ఎవరికి వారు తమ పనులు చేసుకుంటూ పోతున్నట్టు అర్థమవుతోంది. ఏరియాలు, వార్డుల వారీగా బాధ్యతలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించినా వాళ్లు సక్రమంగా పనిచేయట్లేదు. కాల్ సెంటర్లు పనిచేయకపోవడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి గత ప్రభుత్వం వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయలను ఏర్పాటు చేసి ప్రతి 50, 75 ఇళ్లకు అధికారులను, వాలంటీర్లను ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్కార్ వచ్చినా కూడా వాటిని పూర్తిగా రద్దు చేయలేదు. ఇప్పటికీ అవి ఎగ్జిస్టింగ్ లోనే ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలయాలను బాధ్యులను చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ వెళ్లి ఉంటే పరిస్థతి కాస్త మెరుగ్గా ఉండేదేమో అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు బాధ్యతలను వార్డుల వారీగా అప్పగించకపోవడం వల్లే గందరగోళం కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :