టీడీపీ నియోజకవర్గాల ఇంజార్జిలతో చంద్రబాబు భేటీ.. వైసీపీ వణికిపోతోందని కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఇంచార్జీలు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, వైసీపీ అరాచకాలను చంద్రబాబుకు వివరించి చెప్పారు. ‘ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలం అవడంతో రాజకీయంగా వైసీపీ పని అయిపోయింది. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ మనుగడ కోసం సీఎంతో సహా వైసీపీ నేతలందరూ మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ధైర్యం నటిస్తున్నారు. లోలోపల మాత్రం ఓడిపోతామనే భయంతో వాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు. జగన్ పాలన చూసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారు. ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు. ఈ విషయం టీడీపీ సభలకు భారీగా హాజరవుతున్న ప్రజలను చూస్తే అర్థం అవుతుంది. ఈ సభలన్నీ భారీగా విజయవంతం అవడంతో వైసీపీకి భయం పట్టుకుంది. అంగబలం, అర్థబలం ఎన్ని ఉన్నా తమ ప్రభుత్వాన్ని ఎవరూ రక్షించలేరనే నిజం చాలా మంది వైసీపీ నేతలకు తెలిసిపోయింది. అందుకే చాలా చోట్ల వైసీపీ జిల్లా అధ్యక్షులను కూడా మార్చేసుకుంటున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






