Radha Spaces ASBL

11న వస్తాం.. రెడీగా ఉండండి..! కవితకు సీబీఐ రిప్లై..!

11న వస్తాం.. రెడీగా ఉండండి..! కవితకు సీబీఐ రిప్లై..!

ఢిల్లీ లిక్కర్ స్కాములో రోజుకో ట్విస్ట్ చూడడం మామూలైపోయింది. ఈ స్కాములో ఎమ్మెల్సీ కవితతో పరిచయం ఉన్న పలువురు వ్యక్తుల పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో కవితను విచారించేందుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరో తేదీన అంటే ఇవాళ విచారిస్తామని తెలిపింది. టైమ్, ప్లేస్ చెప్పాలని కవితకే ఛాయిస్ ఇచ్చింది. ఇందుకు మొదట రిప్లై ఇచ్చిన కవిత ఆరో తేదీ హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి విచారించుకోవచ్చని తెలిపింది. ఇంతలో ఏమైందో ఏమో కవిత సీబీఐకి ట్విస్ట్ ఇచ్చింది.

సీబీఐ తనకు ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్ తో పాటు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు కవిత. అనంతరం.. తనకు FIR కాపీ కావాలని కోరారు. తమ వెబ్ సైట్ లో ఉందని.. చూసుకోవచ్చని సీబీఐ సూచించింది. అయితే FIR కాపీలో ఎక్కడా తన పేరు లేదని.. అయినా తాను విచారణకు సహకరిస్తామని సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత లేఖ రాశారు. అయితే ముందుగా నిర్దేశించుకున్న కొన్ని కార్యక్రమాల వల్ల ఆరో తేదీ అందుబాటులో ఉండట్లేదని.. తనే నాలుగు తేదీలు ప్రతిపాదించింది. దీంతో ఈ వ్యవహారం మొదటికొచ్చినట్లయింది.

వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాములో కవితను ఇవాళ విచారించాల్సి ఉంది. ఆరో తేదీ వచ్చి విచారించుకోవాలని కవిత కూడా రిప్లై ఇచ్చింది. దీంతో ఇవాళ కవితను విచారించేందుకు సీబీఐ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈరోజు తాను అందుబాటులో ఉండట్లేదని, డిసెంబర్ 11,12, 14,15 తేదీల్లో విచారణకు రావాలని సూచించింది. అయితే సీబీఐ నుంచి దీనిపై వెంటనే సమాధానం రాకపోవడంతో కవితను ఈరోజు విచారిస్తారేమోనని మీడియా మొత్తం ఎదురు చూసింది. ఉదయం నుంచి కవిత ఇంటి వద్ద పడిగాపులు కాచింది.

అయితే కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు రాలేదు. దీంతో ఇవాళ కవితను విచారించకపోవచ్చని అనుకున్నారు. అయితే సాయంత్రం సీబీఐ నుంచి కవితకు సమాచారం అందింది. మీరు సూచించిన విధంగానే ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వచ్చి కలుస్తామని.. వివరణ తీసుకుంటామని వెల్లడించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు కవితకు సమాచారమిచ్చింది సీబీఐ. దీంతో కవిత విచారణపై ఉత్కంఠకు తెరపడింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :