దేశంలోనే తొలిసారిగా.. తెలంగాణ నుంచి
నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది. త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు.
Tags :