తెలుగు రాష్ట్రాల పిల్లలకు అద్భుత అవకాశం - జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఆడిషన్స్!"

ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు ఇప్పుడు డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 6 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు ప్రతిభగల గాయనీ గాయకులనూ ఆడిషన్స్‌కి ఆహ్వానిస్తోంది. - డ్రామా జూనియర్స్ సీజన్ 6 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులతో పాటు సంగీతంపై మక్కువ గల వారికీ ఇదే చక్కని అవకాశం.
3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇదే సువర్ణావకాశం. మీ పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి. విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్తో పాటు సింగింగ్ షో కోసం ఆన్‌గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనుంది. గాయకులుగా మారాలని కలలు కనే అన్నివయస్సుల వారికీ అద్భుత అవకాశం అందిస్తోంది మీ జీ తెలుగు. ఏప్రిల్ 01 మరియు 02 తేదీల్లో దిగువ పేర్కొన్న నగరాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడిషన్‌లు నిర్వహించబడతాయి. ఏవైనా సందేహాలు ఉంటే 9154984009 నెంబర్‌కి కాల్ చేయవచ్చు.
ఆడిషన్స్ వివరాలు |
|||
Sl. No. |
పట్టణం |
తేదీ |
వేదిక |
1 |
ఖమ్మం |
ఏప్రిల్ 01
|
బడ్జెట్ హోటల్, గాంధీ చౌక్, రామచంద్ర నగర్ కాలనీ, మోతీ నగర్, ఖమ్మం |
2 |
తిరుపతి |
ఏప్రిల్ 01
|
హోటల్ పి.ఎల్.ఆర్. గ్రాండ్, జయశ్యామ్ రోడ్, సెంట్రల్ బస్టాండ్ వెనక, టాటా నగర్, తిరుపతి |
3 |
రాజమహేంద్రవరం |
ఏప్రిల్ 01
|
లా హోస్పిన్ హోటల్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, పుష్కర్ ఘాట్ రోడ్, శేషయ్య మెట్ట, రాజమహేంద్రవరం |
4 |
హనుమకొండ |
ఏప్రిల్ 02
|
హరిత కాకతీయ హోటల్, నక్కల గుట్ట, హనుమకొండ |
5 |
నెల్లూరు |
ఏప్రిల్ 02 |
సీజన్స్ ఇన్, పోలీస్ ఆఫీస్ రోడ్, దర్గామిట్ట, నెల్లూరు |
6 |
విశాఖపట్నం |
ఏప్రిల్ 02
|
రాయల్ ఫోర్ట్ హోటల్, జి.వి.ఎం.సి. ఎదురుగా, అసిల్ మెట్ట జంక్షన్, రామ్ నగర్, విశాఖపట్నం |
మట్టిలోని మాణిక్యాలను గుర్తించేందుకు వచ్చేస్తోంది మీ జీ తెలుగు!