ASBL Koncept Ambience
facebook whatsapp X

కారు .. పరేషాన్..?

కారు .. పరేషాన్..?

కారులో పరేషాన్ మొదలైందా..? మొన్నటి వరకూ బస్తీమే సవాల్.. వంద గెల్చేస్తామంటూ గులాబీ నేతలు ధైర్యంగా చెప్పేవారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైతం .. పదేపదే ఇదే చెప్పేవారు. అయితే ఎన్నికల సందడి కాస్త మొదలై, విపక్ష కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో.. ఇప్పుడా ప్రస్తావన కనిపించడం లేదు. అంతేకాదు... ఓసందర్భంగా సీఎం కేసీఆర్ సైతం ఓడిస్తే.. ఏముంది ఫామ్ హౌజ్ లో రెస్టు తీసుకుంటాననడం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేసీఆర్.. ఇలా మాట్లాడారన్న చర్చ జరిగింది.

అయితే ఎన్నికల వ్యూహరచన విషయంలో కేసీఆర్ ను గండరగండడుగా భావిస్తారు. అలాంటి కేసీఆర్ తెలిసి ఓ విషయంలో తప్పుచేశారన్న చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో వ్యక్తమైనా.. ఓ పదిమందికి తప్ప అందరికీ టికెట్లిచ్చారు. ఇప్పుడదే అంశం.. పార్టీని భయపెడుతోంది. సీఎం సైతం అభ్యర్థిని చూసి కాదు.. పార్టీ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. అంటే దానర్థం.. మా ఎమ్మెల్యేలు సరైనవారు కాదని అంగీకరించడమేనా అన్న చర్చ మొదలైంది.

పలువురు ఎమ్మెల్యేలపై క్రిమినల్, భూకబ్జాలు ఇతరత్రా కేసులున్నాయి. ప్రజల్లో సైతం.. తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతెందుకు పార్టీ కార్యకర్తలు సైతం వీరికి టికెటిస్తే .. ఓడించి తీరతామని ప్రతిజ్ఞలు చేశారు. అయినా వాటిని లెక్కచేయని కేసీఆర్.. వారికే టికెట్లిచ్చారు. ఇప్పుడు ఎక్కడ, ఏం జరుగుతుందో అన్న భయంతో ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈనెల 13 నుంచి మూడో విడత ప్రచారం మొదలు పెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 45కుపైగా ప్రచార సభలు నిర్వహించారు. కానీ, కేసీఆర్ ప్రసంగాల్లో .. పదును కనిపించడం లేదు. రొటీన్ విమర్శలే కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపైనా పెద్దగా జనంలో చర్చ జరగడం లేదు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు కనిపిస్తోంది. ఏదోలా ఒడ్డెక్కితే చాలురా దేముడా అన్నట్లుగా తయారైంది కారు పార్టీ పరిస్థితి.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :