ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆమె పరిపాలనే బాగుంటే ...టీడీపీ ఎందుకు? : కేసీఆర్

ఆమె పరిపాలనే  బాగుంటే ...టీడీపీ ఎందుకు?  : కేసీఆర్

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆమె పరిపాలన బాగుండుంటే ఎన్టీఆర్‌ టీడీపీని ఎందుకు పెడతారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ  ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి రూ.2.లకే కిలో బియ్యం ఇచ్చాకే పేదల కడుపు నిండిరదన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ. దాని కోసం 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. మలి దశ ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ భాగమైంది. తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాం. అయినా తెలంగాణ రాకపోయేసరికి ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేశాం. ఆ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌ లాంటి వాళ్లు భాగమై ధూంధాం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనేక పోరాటాల తర్వాత కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చిందన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని పింఛన్లను పెంచుకుంటూ పోయాం. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇస్తున్నాం. సాగునీటి పథకాల కారణంగా పొలాలు కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. కరీంనగర్‌కు మీకు ఏదో లింకు ఉంది అని ఇటీవల మా కరీంనగర్‌ భీముడు గంగుల కమలాకర్‌ అన్నారు. పెళ్లి ఇక్కడే చేసుకున్న కాబట్టి లింకు ఉంది అన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పథకం ప్రకటిస్తున్నాను. అందుకే మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఆటోలకు ఫిట్‌నెస్‌ ఛార్జీ, సర్టిఫికెట్‌లకు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని, దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది అని అన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :