బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల విరాళం
తెలంగాణ వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళం ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్నా ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపడుతున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.
Tags :