Radha Spaces ASBL

బాంబే హైకోర్టులో మమత బెనర్జికి చుక్కెదురు

బాంబే హైకోర్టులో మమత బెనర్జికి చుక్కెదురు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్‌ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన  పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2021, డిసెంబర్‌లో ముంబైలో జరిగిన  ఓ కార్యక్రమంలో మమతా బెనర్జి జాతీయ గీతాన్ని అగౌరపర్చారంటూ బాంబే హైకోరులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో తాను నేరం చేయలేదని, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మమతా బెనర్జి అప్పీల్‌ చేశారు. ఆ అప్పీల్‌ను తాజాగా కోర్టు తోసిపుచ్చింది. 2021లో ముంబైలో జరిగిన  ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపర్చినందుకు మమతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశాడు. మమత ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆమె లేచి నిలబడలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మమత జాతీయగీతాన్ని అవమానించారని ఆరోపించారు. ఘటనకు  సంబంధించిన వీడియో క్లిప్‌ను కోర్టుకు సమర్పించారు. అనంతరం ఈ అంశం బాంబే హైకోర్టుకు చేరింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :