ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్రీవారికి సొంతంగా పాల డైరీ.. బోడే రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..

శ్రీవారికి సొంతంగా పాల డైరీ.. బోడే రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి (Lord Venkateswara) ఆస్తుల వివరాలు అనంతంగా ఉంటాయి. భక్తులు ఎంతో ప్రేమగా ఆయనకు సమర్పించే కైంకర్యాలు చాలా సందర్భాలలో మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం తిరుమల లో జరుగుతున్న నేయి కల్తీ (Ghee Adulteration) వివాదం కారణంగా ఓ భక్తుడు చేసిన ప్రకటన మాత్రం సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారి లడ్డు( Srivari Laddu) ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి కల్తీ జరిగింది అన్న ఆరోపణ లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 

ఇప్పుడు ఈ ఘటనపై తాజాగా సుప్రీం కోర్ట్ దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ప్రభుత్వానికి హితవు పలికింది. ఇంకా ఈ విషయంపై పూర్తిగా విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడే రామ‌చంద్ర యాద‌వ్ ( Bode Ramachandra Yadav) ఇంతవరకు ఎవరు ఈ సమస్యకి ఆలోచించని పరిష్కారాన్ని సూచించారు. స్వామి వారి కైంక‌ర్యాలకు, ప్రసాదాలకు వినియోగించే నేతిని సొంతంగానే తయారు చేసేందుకు తాను కృషి చేస్తాను అని పేర్కొన్నారు. 

కేవలం చెప్పడమే కాదు స్వయంగా వేయి గోగులు తిరుమలకు సమర్పించడంతోపాటు దాతల నుంచి మరొక లక్ష గోవులను సమకూరుస్తానని ఆయన చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారి సేవకు వినియోగించడం కోసం స్వయంగా దేవస్థానానికి సొంత డైరీ ఉండేలా ఏర్పాటు చేయడానికి సహకరిస్తానని కూడా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న తిరుమల నేయి వివాదం నేపథ్యంలో తిరుమల పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. 

ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మంగళవారం నాడు శ్రీవారిని దర్శించుకున్న బోడే.. మీడియాతో మాట్లాడుతూ తిరుమల దేవస్థానానికి సొంతగా డైరీ ఏర్పాటు చేస్తే పదివేల మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది అని పేర్కొన్నారు. స్వామి వారి ప్రసాదమైన లడ్డు తయారీకి ఉపయోగించే నేతిని స్వయంగా టీటీడీ తయారు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇది నిజంగానే హర్షించదగిన ఉపాయం. వేలకోట్ల ఆస్తిపరుడైన తిరుమల శ్రీవారికి సొంతంగా డైరీ ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఇలా కల్తీ జరుగుతుందేమో అన్న అపోహ కూడా వచ్చే అవకాశం ఉండదు. లడ్డు నేతిలో కల్తీ జరిగింది అన్న నాటి నుంచి అందరూ ఎలా జరిగింది అని ఆలోచించే వారే తప్ప భవిష్యత్తులో జరగకుండా ఎలా చేయాలి అని ఆలోచించిన వ్యక్తి ఒక్క బోడే మాత్రమే అనడంలో డౌట్ లేదు.

 

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :