ASBL NSL Infratech
facebook whatsapp X

కర్నాటకలో బీజేపీ యాక్టివ్ అవుతోందా..?

కర్నాటకలో బీజేపీ యాక్టివ్ అవుతోందా..?

కర్నాటకలో కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలవ్వడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ మధ్య అగాధం కూడా వారికి కలిసివస్తోంది. అయితే రీసెంట్ గా ముడా ఇంటిస్థలాల విషయంలో అవినీతి వ్యవహారాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ... దాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాంశంగా మార్చుకుంది. ర్యాలీలతో దూసుకెళ్తోంది.

ముఖ్యంగా ముడా అక్రమాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేయాలని, సీబీఐ ద్వారా విచారణ జరపాలని బీజేపీ - జేడీఎస్‌ సంయుక్తంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. మరో మూడు రోజుల్లో యాత్ర మైసూరులో ముగుస్తుంది. ఆ వెంటనే మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని స్వయంగా సీఎం సిద్దరామయ్య శాసనసభలో అంగీకరించారు.

ఇప్పటికే మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారు. దీంతో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతిని నిరసిస్తూ బళ్లారిలో ర్యాలీ చేపట్టాలని భావిస్తున్నారు కమలనాథులు. బీదర్‌ నుంచి బళ్లారి లేదా, బళ్లారి నుంచి చిత్రదుర్గకు పాదయాత్ర చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలకు సమాచారం ఇచ్చి కోర్‌ కమిటీతో చర్చించి పాదయాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి శ్రీరాములు తెలిపారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని బీజేపీనేత శ్రీరాములు ఆరోపించారు. కల్యాణ కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.25వేల కోట్ల బడ్జెట్‌ గ్రాంట్లను గ్యారెంటీలకు వినియోగిస్తున్నారని అన్నారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో కోట్లాది రూపాయల అవినీతితో అట్టడుగు వర్గాలకు అందాల్సిన సాయం దూరమైందన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో పాదయాత్ర ద్వారా ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తామని తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :