ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అదే జరిగితే పూర్తి స్థాయి మద్దతు : జో బైడెన్

అదే జరిగితే పూర్తి స్థాయి మద్దతు :  జో బైడెన్

తైవాన్‌ కేంద్ర బిందువుగా అమెరికా, చైనా మధ్య వైరం మరింత ముదురుతోంది. తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌లా కాకుండా, పూర్తి స్థాయిలో తైవాన్‌కు  సైనిక రక్షణ కల్పిస్తామని బైడెన్‌ ఉద్ఘాటించారు. తైవాన్‌ విషయంలో తమ వైఖరి ఇదేనని ఆయన తేల్చి చెప్పారు. వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తైవాన్‌ పట్ల అమెరికా విధానంలో ఎటువంటి మార్పూ లేదని ఆయన చెప్పారు. అటు బైడెన్‌ వ్యాఖ్యల పట్ల తైవాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తైవాన్‌కు భద్రతపరమైన భరోసా అందించే విషయంలో తిరుగులేని దృక్పథాన్ని ప్రదర్శించిన బైడెన్‌కు తైవాన్‌ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.  ఇటీవల అమెరికా చట్ట సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించగా, చైనా అగ్గి మీద గుగ్గిలం అయింది. తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టి ఆ చిన్న దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :