అమెరికాలో కేసుల నుంచి సౌదీ యువరాజుకు రక్షణ

ప్రముఖ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్యపై అమెరికాలో దాఖలైన కేసుల నుంచి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు రక్షణ లభించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ప్రస్తుతం సల్మాన్ సౌదీ ప్రధాని హోదాలో ఉండటంతో తమ దేశంలో అన్ని కేసుల నుంచి ఆయనకు రక్షణ లభించినట్లయిందని వెల్లడిరచింది. ఈ వ్యవహారంపై ఖషోగ్గీ ప్రియురాలు హెటిస్ చెంగిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ యువరాజు ఆ దేశ అధికారులు కలిసి తమ ప్రియుణ్ని అపహరించి, హత్య చేసినట్లు ఆమె ఆరోపించిన సంగతి గమనార్హం.







Tags :