మాజీ మంత్రి అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఇటీవల అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఆమె కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నేత భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజవకవర్గంలోకి ప్రవేశించిన సందర్బంగా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఈ నెల 17న కొత్తపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేశాయి. ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిలప్రియ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Tags :