జపాన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జపాన్‌కు చేరుకున్నారు. ఆ దేశంలో మూడు రోజులు పర్యటించనున్నారు. జపాన్‌లోని హానేడా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాశ్ స్వాగతం పలికారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ బలరాం ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గౌరవార్థం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన విందులో భట్టి పాల్గొన్నారు. అక్టోబరు 4న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Tags :