దసరా సినిమాల్లో బాలయ్య మూవీనే బ్యాలెన్స్

తమ ఫేవరెట్ హీరోల సినిమాలు థియేటర్ రిలీజ్ కోసమే కాదు, ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ అంతే వెయిట్ చేస్తారు. దసరాకు రిలీజైన టైగర్ నాగేశ్వరరావు, మొన్న శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
ఈ నెల 24 నుంచి లియో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. దసరాకు రిలీజైన సినిమాల్లో ఇక ఓటీటీ రిలీజ్ విషయంలో బ్యాలెన్స్ ఉన్నది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఒక్కటే. శ్రీలీల ప్రధాన పాత్రలో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయిదో వారంలో కూడా మెయిన్ థియేటర్లలో థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది.
దీని తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయకపోవడంతో వీకెండ్ వసూళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ దాటేసి ఎప్పుడో లాభాలు వచ్చేయడంతో బయ్యర్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా హక్కులను కూడా ప్రైమ్ వీడియోనే తీసుకుంది. గత వారమే టైగర్ నాగేశ్వరరావు ప్రైమ్ లోకి వచ్చింది కాబట్టి మరో వారం, పది రోజుల్లో గ్యాప్ ఇచ్చి భగవంత్ కేసరిని ఓటీటీలోకి దింపుతారు. భగవంత్ కేసరి ఎప్పుడు ఓటీటీలోకి రానుందనే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.






