బీ కేర్ ఫుల్ అఖిల్

ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, ఒళ్లు హూనం చేసుకుని మరీ కష్టపడినప్పటికీ అఖిల్ కు ఆ సినిమా ఘోరమైన పరాజయాన్నే అందించింది. ఆ సినిమా ఇచ్చిన నిరాశతో అఖిల్ నెలల తరబడి కనిపించకుండా పోయాడు. మళ్లీ రీసెంట్‌గా అఖిల్ కనిపించింది మొన్న జరిగిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనే.
ఏజెంట్ తర్వాత అఖిల్, అనిల్ అనే డైరెక్టర్ తో యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫాంటసీ జానర్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ కాంబో లో సినిమా రావడం పక్కా అని తెలుసు. కానీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం అఖిల్ ఉన్న పరిస్థితికి వెంటనే సినిమాను స్టార్ట్ చేయడం అవసరం.
ఇదిలా ఉంటే అఖిల్, తమిళ డైరెక్టర్ లింగుస్వామి చెప్పిన ఒక లైన్‌కి ఫిదా అయ్యాడని, ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్సుందని వచ్చే వార్తలు విని అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారు. లింగుస్వామి ఇప్పుడు ఫామ్ లో లేడన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కోలీవుడ్ హీరోలే ఆయనకు ఛాన్స్ లు ఇవ్వడానికి ఇంట్రెస్టింగ్ చూపించడం లేదు.
అలాంటిది అఖిల్ ఆయన్ను గుడ్డిగా నమ్మి ఎలా ఛాన్స్ ఇస్తాడంటూ ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు. కాకపోతే అఖిల్ ఒకప్పటిలా తొందరపడి, సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. నాగార్జునతో డిస్కస్ చేశాకే సినిమాల విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నాడని టాక్. లింగుస్వామి సినిమా విషయంలో కూడా నాగ్ డెసిషన్ తీసుకుని, ఆచితూచి వ్యవహరిస్తే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.






