Radha Spaces ASBL

కేసీఆర్ జాతకం బాగాలేదు.. 2023 వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

కేసీఆర్ జాతకం బాగాలేదు.. 2023 వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

కేసీఆర్‌ జాతకం బాగలేదని, 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 317 జీవోను సవరించేవరకు సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమైందో కేసీఆర్‌ గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నేతలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్చువల్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్‌ పాఠశాల నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లిషు మీడియం అంటున్నారన్నారు. ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బీజేపీ అండగా ఉంటోందని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఉపాధ్యాయ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని ఇతర రాష్ట్రాలు హామీ ఇవ్వలేదని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :