ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య.. తెలంగాణలోనే ఎందుకు ?

ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య.. తెలంగాణలోనే ఎందుకు ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాష మార్చుకోవాలన్నారు. మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు అని తెలిపారు. ఢిల్లీ వెళ్లాచ్చాక కేసీఆర్‌కు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. మెడపై కత్తి పెడితే ఫాం హౌస్‌ రాసిస్తారా? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందని అని నిలదీశారు. రా రైస్‌ పక్కాగా కొంటామని  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారని తెలిపారు.  యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎలా బంద్‌ చేస్తారో చూస్తామన్నారు. వానాకాలం పంటను ఎలా కొంటున్నారో, అలాగే యూసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :