మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పాలమూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్‌ను కేటీఆర్ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 3 తారీఖు నాడు కేసీఆర్ మాజీ సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పారు. ఈసారి కమలం పువ్వుకు ఓటు వెయ్యకపోతే పేదలను ఎవరు కాపాడలేరన్నారు.
పేపర్ లికేజీ కోసం తాను పోరాడితే తనను పోలీసుగు గొడ్డును లాక్కుపోయినట్లుగా లాక్కుపోయారని అన్నారు. నామీద 74 కేసులు ఉన్నాయన్నారు. మీ కోసం మేం మా బతుకులు నాశనం చేసుకున్నామన్నారు. మీరంతా సినిమాలు చూస్తు ఏంజాయ్ చేస్తే మేమంతా మీకోసం పోరాడుతున్నామన్నారు. మీరు హోటల్స్ కు వెళ్తే, మేము మా కుటుంబానికి దూరమై మీకోసం పోరాడతున్నామని అటువంటి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. పాలమూరు మంత్రి కబ్జాలు, దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని తమపై కేసులు పెడుతున్నారు అంటూ విమర్శించారు.






