‘అథర్వ’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలి.. డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా
సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శశి కుమార్ తిక్కా, హీరో చైతన్య రావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం..
*శశి కిరణ్ తిక్కా మాట్లాడుతూ..* ‘‘అథర్వ’ నుంచి జావెద్ అలీ పాడిన పాటను నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను. ఆ పాట తప్పా నాకు ఇంకేమీ తెలియదు. ట్రైలర్ ఇప్పుడే చూశాను. ప్రతీ విషయాన్ని ఎంతో డీటైలింగ్‌గా చూపించారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంత ఉంటుందా? ఇంత పరిశీలనగా చూస్తారా? క్లూస్ టీం గురించి వివరించారు. ట్రైలర్ చూశాక సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. డైరెక్టర్ మహేష్ గారు, నిర్మాత సుభాష్ గారు, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 1న ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకున్నారు.
*దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..* ‘క్లూస్ డిపార్ట్మెంట్‌ను క్లుప్తంగా చూపించబోతున్నాం. సురేష్ ప్రొడక్షన్స్‌తో భారీ ఎత్తున రాబోతున్నాం. ట్రైలర్‌లో చూపించిన దానికంటే ఎక్కువ సినిమాలో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు. శ్రీ చరణ్ పాకాల కొత్త సౌండ్‌ను క్రియేట్ చేశారు. కెమెరామెన్ చరణ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. మంచి విజువల్స్ ఇచ్చారు. కార్తీక్ రాజు బయట చిల్ ఉంటాడు. తెరపై ఇంటెన్స్‌గా కనిపిస్తారు. సిమ్రన్ పాత్ర బాగుంటుంది. ఐరా అద్భుతంగా నటించారు. సుభాష్, శ్రీనివాస్ గారు కథను నమ్మి ఇంత భారీ ఎత్తున నిర్మించారు. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన శశికిరణ్ గారికి థాంక్స్. చైతన్య రావు నాకు మంచి మిత్రుడు. అతని సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. మీడియా, ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత సుభాష్ మాట్లాడుతూ..* ‘టీం అంతా కష్టపడి సినిమాను తీశాం. మీడియా సపోర్ట్‌తో జనాల్లోకి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*చైతన్య రావు మాట్లాడుతూ..* ‘డిసెంబర్ 1 అథర్వ థియేటర్లోకి రాబోతోంది. నేను ఈ చిత్రాన్ని ఆల్రెడీ చూశాను. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఈ మూవీలో సౌండ్ అదిరిపోతుంది. శ్రీ చరణ్ తన మార్క్ వేసేశాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు ఆర్ఆర్ ఇంపార్టెంట్. అన్నీ ఒకెత్తు అయితే.. శ్రీ చరణ్ మ్యూజిక్ ఇంకో ఎత్తు. ఇంత వరకు క్లూస్ టీం మీద సినిమా రాలేదు. మహేష్ రెడ్డి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. కార్తీక్ ఈ సినిమాతో మంచి మాస్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. సిమ్రన్, ఐరాలు అద్భుతంగా నటించారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన సుభాష్‌కు హ్యాట్సాఫ్. ఆయనకున్న ఆ ప్యాషన్ కోసమైనా ఈ సినిమాను అందరూ చూడాలి. మహేష్ పక్కా కమర్షియల్ డైరెక్టర్ అవుతారు. డిసెంబర్ 1న సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
*కార్తీక్ రాజు మాట్లాడుతూ..* ‘ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే చెందుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాం. క్లూస్ టీం బ్యాక్ డ్రాప్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. శ్రీ చరణ్ పాకాలతో పని చేయడం రెండోసారి. కెమెరామెన్ చరణ్ మా అందరినీ బాగా చూపించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సుభాష్‌కు థాంక్స్. డిసెంబర్ 1న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి’ అని అన్నారు.
*సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ..* ‘నేను టీజర్, ట్రైలర్ చూశాను. సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను ఇలాంటి జానర్లో సినిమా చేయడం ఇదే మొదటి సారి. మా దర్శకుడు ఈ చిత్రం కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. కార్తీక్ రాజుతో పని చేయడం ఆనందంగా ఉంది. అతనిది చిన్న పిల్లాడి మనస్తత్వం. మా నిర్మాత సుభాష్ ఎక్కువగా మాట్లాడరు. కానీ సినిమాను అద్భుతంగా నిర్మించారు. డిసెంబర్ 1న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
*హీరోయిన్ ఐరా మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కార్తీక్, సిమ్రన్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ..* ‘నేను థ్రిల్లర్ మూవీస్ చాలానే చేశాను. ఇన్వెస్టిగేషన్‌లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ గురించి చాలా మందికి తెలియదు. ఎంతో రీసెర్చ్ చేసి మహేష్ రెడ్డి ఈ మూవీని తీశారు. కొత్త సౌండ్ ఇవ్వడానికి నాకు స్కోప్ వచ్చింది. అందరూ అద్భుతంగా పని చేశారు. డిసెంబర్ 1న అందరూ థియేటర్లో సినిమాను చూడండి’ అని అన్నారు.
*కెమెరామెన్ చరణ్ మాట్లాడుతూ..* ‘మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన శశి కిరణ్, మా హీరో చైతన్య రావుకు థాంక్స్. క్లూస్ డిపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాగుంటుంది. అందరూ చూడండి’ అని అన్నారు.