ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్‌లో ఆటా బోర్డ్‌ సమావేశం... అట్లాంటాలో ఆటా 18వ మహాసభలు 

డల్లాస్‌లో ఆటా బోర్డ్‌ సమావేశం... అట్లాంటాలో ఆటా 18వ మహాసభలు 

అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే6, 2023 న డాలస్,టెక్సా స్, అమెరికాలో జరిగిన బోర్డు సమావేశంలో అధ్యక్షురాలు మధు బొమ్మి నేని అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, పాలకమండలి బృందసభ్యుల ఆధ్వర్యంలో ఎనిమిదిగంటలపాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజనల్ అడ్వయిసర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వయిసర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు.

ఆటా సంస్థ అధ్యక్షురాలు మధు బొమ్మి నేని 2023 సంవత్సరములో జనవరి నుండి ఏప్రిల్ వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ముందుగా వివిధ నగరాలలో ముమ్మరంగా జరిపిన పద్దెనిమిది మహిళా దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో జరగడము ఇదేమొదటి సారి అని వ్యక్తం చేసారు. అలాగే ఇమిగ్రేషన్ వెబినార్,హోలి, ఇల్లు లేని వారికి ఆహర సరఫరా సేవా, మహిళలకు రంగోలి, వంటల పోటీలు, మహిళల క్రికెట్, త్రోబాల్ క్రీడా కార్యక్రమాలు, ఆటా డే ఉత్సవాలు చేసిన ఆటాకార్యవర్గ బృందాన్ని కొనియాడుతూ వారికున్న ఉత్సా హానికి, సేవానిరతికి కృతజ్ఞతతో అంజలి ఘటించారు. ప్రతీ వారము ఆటాకొనసాగిస్తున్న యోగా కార్యక్రమములో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసినదిగా అమెరికా వాసులందరికి  పిలుపునిచ్చారు. సంస్థ అందచేస్తున్న టెక్నాలజి, ఉన్నత విద్యా భివృద్దికి సంబందించిన సేల్స్ ఫోర్స్ మరియు సాట్ శిక్షణల గురించి, అమెరికాభారతి ఆటా 2023 మొదటిత్రైమాసిక పత్రిక ఏప్రిల్ 1 న విడుదల చేసామని, ద్వితీయ త్రైమాసిక పత్రిక కవర్పేజి కోసం యువత కి ‘ఆర్ట్ పోటీ’ నిర్వహిస్తున్నా ము అని తెలియచేసారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు గత సంవత్సరం ఆటా సంబరాలకు పెద్ద మొత్తములో దాతగా నిలబడి, మెడిటేషన్ గురించి అమెరికా వాసులకిఅంతర్జాలములో శిక్షణను కలిగించినందుకు అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా దాతలుగా నిలిచిన ఆటా పూర్వధ్యక్షులకు, పాలకమండలి సభ్యు లకు ధన్యవాదాలు తెలియపరిచారు.

ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అమెరికాలోనే కాకుండా ‘టర్కీ యెర్త్ క్వేక్’ కి ధనసహాయం రెడ్ క్రాస్ సంస్థ తో సమన్వయంగాచేయడం, అలాగే తెలంగాణ గ్రామీణ మహిళల కోసం 'యెనేమియా అవేర్నెస్’ ప్రోగ్రాం ద్వా రా విటమిన్స్ అందచేయడానికి తగిన నిధులు జమచేసి పంపడం జరుగుతుంది అని, నిరంతరంగా సేవా సహాయ, కార్యక్రమాలలో సంస్థకార్యవర్గం ముందంజలో ఉంటుంది అని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని కొనియాడారు.

ఆటా లో అత్యధికంగా కొత్త సభ్యు లని చేర్చినవారికి ‘మోస్ట్ వాల్యు బుల్ పర్సన్ అఫ్ దిమంత్’ గా గుర్తింపుని మార్చ్ మాసం రాలీ నుండి శృతి చామల గడ్దం, ఏప్రిల్ మాసం సాండియేగో నుండి కాశప్ప మదారం గారులకు, అలాగే ఫస్ట్ క్వా ర్టర్ లో మంచి కార్యక్రమాలను పెద్దమొత్తంలో చేస్తున్న జాబితాలో ‘మోస్ట్ వాల్యు బుల్ సిటీ అఫ్ ది మంత్’ గా ఫీనిక్స్ నగరాన్ని గుర్తించి సంస్థ అభినందించింది అని సమావేశములో తెలియపరుస్తూ, అధిక సంఖ్యలో సంస్థలో సభ్యు లను చేర్చడానికి, వినూత్నంగా భాష,సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను, మరెన్నో సహాయకార్యక్రమాలను చేయాలని కార్యవర్గబృందాన్ని ప్రోత్సహించారు.

అట్లాంటాలో ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జరపడానికి పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. అమెరికా తెలంగాణ సంఘం అమెరికా తెలుగు సంఘం లో ఐక్యమవ్వాలనే ప్రతిపాదనని పాలకమండలి సభ్యులు ఆమోదించారు. కలిసి పని చేసే ప్రాతిపదిక పై కమిటీని నిర్ణయించారు. అధ్యక్షురాలు మధు బొమ్మి నేని ఆటా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

Click here for PhotoGallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :