Radha Spaces ASBL

ఎఐఎ ఆధ్వర్యంలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎఐఎ ఆధ్వర్యంలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ) ఆధ్వర్యంలో 73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని 38కి పైగా ఉన్న అసోసియేషన్‌లు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్‌ లైవ్‌ యూట్యూబ్‌ ద్వారా ఈ వేడుకలను ప్రసారం చేశారు. ఈ సంవత్సరం థీమ్‌ ‘‘75వ సంవత్సరం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’. జాతీయ గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సుల్‌ జనరల్‌ రాయబారి డా. టీవీ నాగేంద్రప్రసాద్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, బే ఏరియాలో భారతీయ సంతతికి చెందిన కమ్యూనిటీకి అసోసియేషన్‌లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. స్థానిక కమ్యూనిటీలతో భారతీయ కమ్యూనిటీలు సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలపరుచుకునేలా వ్యవహరించడం వల్ల భారత్‌ ` అమెరికా మధ్య బంధం మరింతగా బలపడిరదని ఆయన చెప్పారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, యుఎస్‌ పురాతన ప్రజాస్వామ్య దేశంగా ఉందని, ఈ రెండు దేశాలు కలిసి బహుళ సమాజాలను, తాము ఎంచుకున్న ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా కమ్యూనిటీ అభివృద్ధికి పాటుపడుతున్నాయని చెప్పారు. 

ఈ వేడుకల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు భారతీయ కమ్యూనిటీకి తమ శుభాకాంక్షలను, సందేశాన్ని అందించారు. సెనేటర్‌ డేవ్‌ కోర్టేస్‌, (ఎస్‌డి15), అసెంబ్లీ సభ్యుడు బిల్‌ క్విర్క్‌ (ఎడి20), అసెంబ్లీ సభ్యుడు యాష్‌ కల్రా, (ఎడి 27), అసెంబ్లీ సభ్యుడు అలెక్స్‌ లీ (ఎడి 25), అలమెడ కౌంటీ సూపర్‌వైజర్‌ డేవిడ్‌ హౌబెర్ట్‌, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ ఒట్టో లీ, ఓక్లాండ్‌ మేయర్‌ లిబ్బి షాఫ్‌, సన్నీవేల్‌ మేయర్‌ లారీ క్లైన్‌, ఫ్రీమాంట్‌ వైస్‌ మేయర్‌ రాజ్‌ సాల్వాన్‌, శాన్‌ రామన్‌ వైస్‌ మేయర్‌ శ్రీధర్‌ వెరోస్‌, శాంటా క్లారా వైస్‌ మేయర్‌ సుధాన్షు జైన్‌, శాంటా క్లారా కౌన్సిల్‌ సభ్యుడు కెవిన్‌ పార్క్‌ తదితరులు కమ్యూనిటికి శుభాకాంక్షలు అందించి ప్రసంగించారు. 

కార్యక్రమంలో ఎఐఎలోని అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా ప్రసంగించి శుభాకాంక్షలు అందజేశారు. తరంగిణి స్కూల్‌ ఆఫ్‌ కథక్‌ డ్యాన్స్‌, ఏరోడాన్స్‌, బే ఏరియా నృత్య గురుకుల్‌ కు చెందిన విద్యార్థులు బాలీవుడ్‌ నృత్య ప్రదర్శనలతో అలరించారు. బే ఏరియా గాయకులు శ్రీధర్‌ గణపతి, బాలాజీ తమిరిస, శేష ప్రసాద్‌ ఈ సందర్భంగా దేశభక్తి గీతాలను, బాలీవుడ్‌ పాటలను పాడారు.

అమెరికన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ బీహార్‌ (AODB), ఆశాజ్యోతి సంస్థ, అమెరికాలో రాజస్థాన్‌ అసోసియేషన్‌ (బే ఏరియా), బీహార్‌ ఫౌండేషన్‌ (ఖూA - కాలిఫోర్నియా బ్రాంచ్‌), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌(బాటా), బే ఏరియా తమిళ్‌ మన్రం, బే మలయాళీ, బీహార్‌ అసోసియేషన్‌, బ్రహ్మ కుమారీలు, ఫెడరేషన్‌ ఆఫ్‌ మలయాళీ అసోసియేషన్స్‌ ఆఫ్‌ అమెరికాస్‌, గుజరాతీ కల్చరల్‌ అసోసియేషన్‌ (GCA), GOPIO (గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌), ILP (భారత అక్షరాస్యత ప్రాజెక్ట్‌), ఇండో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బే ఏరియా, IACF - ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ ఫెడరేషన్‌, KKNC (కన్నడ కూట ఆఫ్‌ ఉత్తర కాలిఫోర్నియా), KTF - కాశ్మీరీ టాస్క్‌ ఫోర్స్‌, MANCA -నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, OSA (కాలిఫోర్నియా చాప్టర్‌), పాఠశాల (తెలుగు పాఠశాల), జA (పంజాబీ కల్చరల్‌ అసోసియేషన్‌), రోటరీ ఇంటర్నేషనల్‌, SRCA (శాన్‌ రామన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌), SEF (శంకర ఐ ఫౌండేషన్‌), స్పందన సంస్థ, తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), TCA (తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌), TDF (తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌), యునైటెడ్‌ ఫిజీ అసోసియేషన్‌, UPMA (ఉత్తర ప్రదేశ్‌ మండలం), వేద దేవాలయం, VPA (వొక్కలిగ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా), విటిసేవ సంస్థలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. 

Click here for Photogallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :