తాజ్‌మహల్ పై మరోసారి వివాదం... నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి
తాజ్‌మహల్‌పై మరోసారి వివాదం తలెత్తింది. ఆ అపురూప పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. సోమవారం సాయంత్రం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పర్యాటకులకు తాగునీరు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్‌లోకి వచ్చి నీటిని తాగొచ్చని భారతీ పురాతత్వ సర్వేక్షణ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా `ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు.
తాజ్ మహల్ అల్ణసు పేరు తేజోమహాలయం అని, అది శివుడికి నెలవు అని అఖిల భారత హిందూ మహాసభ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 3న అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు శ్యామ్, వినేష్‌లు తాజ్‌మహల్‌లోని ప్రధాన సమాధిపై గంగాజలం పోశారు. సీఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు మేరకు శ్యామ్ వినేష్‌లపై తాజ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మీరా రాఠోడ్ అనే మహిళ తాజ్‌మహల్‌లోని ప్రధాన సమాధి వద్దకు చేరుకుని గంగజలాన్ని సమర్పించింది.