Radha Spaces ASBL

హైకమాండ్ ఫార్ములా..

హైకమాండ్ ఫార్ములా..

సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య.. సయోధ్య మంత్రాన్ని జపిస్తోంది. దీనిలో భాగంగా రాజస్థాన్ సంక్షోభంపైనా దృష్టి సారించింది. ఒకరేమో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత , మరొకరు జనాకర్షణ ఉన్న యువనాయకుడు... ఇద్దరూ ఇద్దరే..వీరిద్దరి మధ్య సమన్వయం ముఖ్యమని భావించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇద్దరితో చర్చలు జరిపింది. సార్వత్రిక ఎన్నికల వరకూ ఇద్దరూ కలిసికట్టుగా పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించింది. హైకమాండ్ తో చర్చల తర్వాత .. ఇద్దరం కలిసి బీజేపీపై ఫైట్ చేస్తామని జాయింట్ ప్రకటన విడుదల చేశారు.

సీఎం గెహ్లోత్, సచిన్ పైలట్ తో  విడివిడిగా సుదీర్ఘంగా చర్చల తర్వాత.. కాంగ్రెస్ సీనియర్ నేత కేసి.వేణుగోపాల్.. సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు నేతలు కలిసికట్టుగా పోరాడి, పార్టీ విజయం కోసం పనిచేస్తారన్నారు. గెలిచిన తర్వాత పదవుల సంగతి ఆయా నేతలు.. హైకమాండ్ తో చర్చిస్తారన్నారు. గుడ్డిలో మెల్లలా ఆధిపత్యపోరుతో సతమతమవుతున్న రాజస్థాన్ కాంగ్రెస్ కు.. ఈప్రకటన కాస్త ఊరట నిచ్చిందని చెప్పొచ్చు.

కొన్నిరోజులుగా సచిన్ పైలట్.. గెహ్లోత్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వస్తున్నారు. దీనికోసం ఒక్కరోజు నిరాహారదీక్ష, 5 రోజులపాటు పాదయాత్ర చేశారు . అయితే.. పైలట్ ఆరోపణలపై గెహ్లోత్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు చేసేందుకు సరైన కారణాలు లేకపోవడంతో.. ఇలాంటి అంశాలపై ఆందోళనలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు . ఎన్నికలు సమీపిస్తుండడంతో.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని హైకమాండ్ భావించింది . దీంతో ఇద్దరు నేతలతో చర్చలు జరిపి, వీరిని ఏకతాటిపైకి తేవడంలో హస్తం పార్టీ విజయం సాధించింది

కాంగ్రెస్‌కు చాలా రాష్ట్రాల్లో జోడెద్దులున్నాయి. పార్టీకి ఆపదకాలంలో అండగా ఉంటూ వచ్చిన నేతలు కావడంతో.. వారికి  పార్టీ  హైకమాండ్ తగిన ప్రాధాన్యమిస్తోంది. అయితే.. అధికారంకోసం ఆయా నేతలు పోటీ పడుతుండడం.. హైకమాండ్ కు తలనొప్పి తెచ్చిపెడుతోంది. పోనీ కఠినంగా వ్యవహరిద్దామంటే.. పార్టీ సంక్షోభంలో పడుతుంది. దీంతో చాలా లౌక్యంగా  పని చక్కబెట్టే యోచన చేస్తోంది హైకమాండ్.

తొలుత పంజాబ్‌ కాంగ్రెస్‌ సంక్షోభ సమయంలో సమర్థంగా వ్యవహరించకపోవడంతో.... కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కర్నాటకలో హైకమాండ్ వ్యూహం మార్చింది. సీనియర్‌కు డ్రైవింగ్ సీటు అప్పజెప్పి, మిగిలిన వ్యవహారాలు డికె శివకుమార్‌కు అప్పజెప్పింది. ఇద్దరు నేతలు కలిసికట్టుగా ఫైట్ చేయడంతో.. అధికారం దక్కింది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇదే మంత్రాన్ని జపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :