ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాల మూకుమ్మడి దాడి..!

తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాల మూకుమ్మడి దాడి..!

తెలంగాణలో పేపర్ లీక్ అంశం కుదిపేస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విపక్షాలన్నీ రెచ్చిపోతున్నాయి. దీన్ని ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. తమ తప్పేమీ లేదని ప్రభుత్వం చెప్పుకుంటున్నా విపక్షాల నుంచి అంతకు మించి ఎదురుదాడి జరుగుతోంది. దీంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందేమోననే సందేహం కలుగుతోంది. ఎన్నికల్లో ఇది పెద్ద అజెండాగా మారబోతోంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో పేపర్ల లీకేజ్ పెద్ద దుమారంగా మారింది. టీఎస్పీఎస్సీలో పనిచేసే వ్యక్తులే పేపర్ ను బయటి వాళ్లకు అమ్ముకోవడం పెద్ద సంచలనం కలిగిస్తోంది. ఏఏ పేపర్లు లీక్ అయ్యాయో ఆయా పరీక్షలన్నీ రద్దు చేసింది ప్రభుత్వం. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అనుగుణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే పలువురిని విచారించింది. కొందరిపై కేసులు నమోదు చేసింది.

అయితే పేపర్ లీకేజ్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. లీకేజ్ వెనుక ప్రగతి భవన్ పెద్దల హస్తం ఉందని విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే పేపర్ల లీకేజ్ కుంభకోణం జరిగిందని.. వందల కోట్ల లావాదేవీలు జరిగాయని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రూ.100 కోట్లకు పరువునష్టం దావా నోటీసులు పంపించారు. అయితే పేపర్ లీకేజ్ ద్వారా పిల్లల మానసిక క్షోభను అర్థం చేసుకోకుండా తన పరువుకు లెక్కగట్టుకునే పనిలో మంత్రి కేటీఆర్ ఉన్నారని బండి సంజయ్ రివర్స్ అటాక్ చేశారు. రేవంత్ రెడడి కూడా ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

మరోవైపు సిట్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది. తమ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దీన్ని రాజకీయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల .. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి ఫోన్ చేశారు. పేపర్ లీకేజ్ అంశంపై ఉమ్మడిగా పోరాడదామని.. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని పిలుపునిచ్చింది. దీనికి ఇరు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం. అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ప్రగతి భవన్ కు మార్చ్ చేద్దామని షర్మిల ప్రతిపాదించారు. మరి పార్టీల మూకుమ్మడి దాడిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది.. అనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :