ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ కాంగ్రెస్ ముందరి కాళ్లకు కేసీఆర్ ‘బంధం’..!?

తెలంగాణ కాంగ్రెస్ ముందరి కాళ్లకు కేసీఆర్ ‘బంధం’..!?

ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదిలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్ని యాక్టివ్ అయ్యాయి. ఇక అసెంబ్లీ జరిగే రాష్ట్రాల్లో ఆయా పార్టీలు మరింత జోష్ పెంచాయి.

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఈసారి ట్రయాంగిల్ వార్ నడవనుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ ఈసారి తమదే గెలుపని నమ్ముతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. బీజేపీ తొలిసారి తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని చాలాకాలంగా చెప్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ పార్టీకి మరో పెద్ద సమస్య వచ్చి పడింది.

బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. తెలంగాణ ఇచ్చింది తామేనని, ఈసారి తమకు ప్రజలు పట్టం కడతారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. తమ మధ్య ఎన్ని మనస్పర్థలు ఉన్నా అధిష్టానం చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు నేతలు. ఎవరికి వారే యమనా తీరే అన్నట్టు పార్టీని నడిపిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కేసీఆర్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడింది.

రాహుల్ గాంధీ అనర్హత అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. రాహుల్ కు అనర్హత వేటు పడగానే స్పందించిన తొలి నేత కేసీఆర్. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ సమాన దూరం పాటిస్తోంది. ఆ రెండు పార్టీలతో సంబంధం లేకుండా మూడో కూటమిని తెరపైకి తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచన. అయితే రాహుల్ గాంధీపైన బీజేపీ ప్రభుత్వం వేటు వేయగానే కేసీఆర్ ఖండించారు. కేటీఆర్ కూడా ఇది సరికాదని ట్వీట్ చేశారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నేతకు సంఘీభావం ప్రకటించడం తప్పు కాదు.

కానీ కేసీఆర్ సంఘీభావం తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంది. అలాంటప్పుడు పార్టీ అగ్రనేతకు కేసీఆర్ సంఘీభావం ప్రకటించడం, పార్లమెంటులో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ నేతలు ధర్నాలు, నిరసనల్లో పాల్గొంటూ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ముందరి కాళ్లకు బంధం వేసినట్లవుతోంది. ఇక్కడ కేసీఆర్ పై విరుచుకు పడేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. దీంతో ఏ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :