Radha Spaces ASBL

షర్మిల కోటరీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా..?

షర్మిల కోటరీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా..?

తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు వై.ఎస్.షర్మిల. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా గుర్తింపు పొందినా తాను తెలంగాణ కోడలినని చెప్పుకుంటున్నారామె. ఆ అధికారంతోనే తాను తెలంగాణలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. వై.ఎస్.ఆర్.తెలంగాణ పార్టీని స్థాపించి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించాలనేది ఆమె పంతం. మిగిలిన పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. దీంతో అడపాదడపా ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయినా షర్మిల మాత్రం వెనక్కు తగ్గట్లేదు. అయితే ఇటీవల షర్మిల కోటరీ చేస్తున్న కొన్ని పనులు విమర్శలకు తావిస్తున్నాయి.

కొంతకాలం కిందట షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఆమె పాదయాత్రకు ఆటంకం కలగడంతో షర్మిలను హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. లోటస్ పాండ్ లోని ఆమె నివాసంలో దించేశారు. అయితే ఆమె ప్రగతి భవన్ కు ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆమెను అడ్డుకున్న పోలీసులు ఆమె ఉన్న వాహనాన్ని మరో వాహనంతో లాక్కెళ్లారు. ఆమె కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారని.. ఏపీ సీఎం జగన్ ను కూడా దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారని వార్తలొచ్చాయి. అంతేకాదు.. షర్మిలకు ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారని.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

నిన్న ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి... వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారని వార్తలొచ్చాయి. ఒక రహస్య ప్రదేశంలో ఆమెతో భేటీ అయ్యారని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారనే వార్తలు రోజంతా చక్కర్లు కొట్టాయి. షర్మిలతో పొంగులేటి భేటీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆశలు అడియాశలయ్యాయని చెప్పుకొచ్చాయి.

అయితే ఇవన్నీ ఆసత్యాలేనని తర్వాత తేలాయి. నాడు షర్మిలకు ప్రధాని మోదీ చేసారనే వార్త కానీ, నిన్న షర్మిలతో పొంగులేటి భేటీ అయ్యారనే వార్త కానీ నిజం కాదని తేలింది. షర్మిల కోటరీలోని కొందరు వ్యక్తులు ఇలాంటి టీజర్లను వదలడం ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారని అర్థమైంది. తాము నిత్యం వార్తల్లో ఉండేందుకు, తమను తాము ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు షర్మిల కోటరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :