Radha Spaces ASBL

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..! షర్మిలతో పొంగులేటి భేటీ!!

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..! షర్మిలతో పొంగులేటి భేటీ!!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీజేపీలో చేరుతారని కొందరు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మరికొందరు కామెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్టులో మరో పార్టీ కూడా చేరింది. ఆయన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలతో భేటీ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడాయన షర్మిల పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వై.ఎస్.కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే 2014లో ఆయన ఎంపీగా గెలిచారు. విభజన అనంతరం పొంగులేటిని తెలంగాణ శాఖ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే విభజనానంతర పరిణామాల నేపథ్యంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయినా వై.ఎస్. కుటుంబంలో పొంగులేటి సత్సంబంధాలే కలిగి ఉన్నారు. ఇప్పటికీ వై.ఎస్. కుటుంబాన్ని అభిమానిస్తున్నారు. ఇప్పుడు పొంగులేటి పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు.

పొంగులోటి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆ పార్టీలో పదవులు దక్కలేదు. ఆయన అనుచరులకు కూడా ఎలాంటి పదవులు లేకుండానే నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే రాజకీయ నేతలు ఎంతోకాలం స్తబ్దుగా ఉండలేరు. కేడర్ చెల్లాచెదురైపోతుంది. అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో యాక్టివ్ అయ్యేందుకు పొంగులేటి నిర్ణయించుకున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులందరూ పోటీ చేసి తీరుతారని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ లో తమకు తగిన గుర్తింపు దక్కలేదని.. ఎంతోకాలం ఇలాగే ఉండలేమని స్పష్టం చేశారు. దీంతో పొంగులేటి పార్టీ మారడం ఖాయమని అర్థమైంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా పొంగులేటిని పట్టించుకోవడం మానేసింది.

అయితే పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ సీరియస్ గా ట్రై చేస్తోంది. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన 18వ తేదీనే పొంగులేటి ఢిల్లీలో బీజేపీలో చేరుతారని అనుకున్నారు. అయితే అది జరగలేదు. ఆయన ఇప్పటికీ నియోజకవర్గాల వారీగా అనుచరులతో భేటీ అవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఏ పార్టీలో చేరితో తమకు బాగుంటుందో అంచనా వేసుకుంటున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని ఇటీవల పొంగులేటి కామెంట్ చేశారు. దీంతో పొంగులేటి మళ్లీ వైఎస్ ఫ్యామిలీ చెంతకే చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇప్పుడు అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. వై.ఎస్.షర్మిలతో పొంగులేటి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటికి మంచి పట్టుంది. విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లోనే పొంగులేటి ఎంపీగా గెలివడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిస్తే కచ్చితంగా ఖమ్మం జిల్లాలో గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటారని భావిస్తున్నారు. మరి పొంగులేటి పార్టీలో చేరేందుకే భేటీ అయ్యారా.. లేకుంటే మర్యాదపూర్వకమా.. అనేది తెలియాల్సి ఉంది. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :