Radha Spaces ASBL

కేసీఆర్ చేతిలో కీలక నివేదిక..! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు..!!

కేసీఆర్ చేతిలో కీలక నివేదిక..! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇన్నాళ్లూ పెద్దగా హడావుడి చేయకపోయినా ఇప్పుడు పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాను ఈ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధే తననే గట్టెక్కిస్తుందని కేసీఆర్ నమ్ముతున్నారు. అయితే ఈసారి పలువురు అభ్యర్థులను మార్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఎన్నికల్లో తప్పు చేస్తే ఐదేళ్లపాటు ఆ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఎలాంటి తప్పులూ జరగకుండా చూసుకోవాలనుకుంటారు పార్టీల అధినేతలు. ఇప్పుడు కేసీఆర్ ఆలోచన కూడా అలాగే ఉంది. గత ఎన్నికల్లో పెద్దగా ప్రయోగాల జోలికి కేసీఆర్ వెళ్లలేదు. పైగా అప్పుడు ఇంత గట్టి పోటీ కూడా లేదు. కాబట్టి ఈజీగా గెలుస్తామనే ధీమా ఉండేది. కాబట్టి దాదాపు సిట్టింగులందరికీ మళ్లీ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. కానీ ఈసారి పరిస్థితి అలా కనిపించటం లేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటున్నారు.

గతంలో కొన్నాళ్లపాటు బీఆర్ఎస్ కు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సేవలందించింది. అయితే ఐప్యాక్ షరతులను, మితిమీరిన జోక్యాన్ని సహించలేని కేటీఆర్, కేసీఆర్.. దానికి దండం పెట్టి పంపించేశారు. అప్పటి నుంచి సొంత సర్వేలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు తన టీంతో నియోజకవర్గాల్లో పరిస్థితులను తెప్పించుకుంటున్నారు. దానికి అనుగుణంగా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. తాజాగా దాదాపు 15 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని కేసీఆర్ గుర్తించారు. వీళ్లందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇవ్వనని కరాఖండిగా చెప్పేశారు. చివరి నిమిషంలో సీటు రాలేదని బాధపడొద్దని ముందే చెప్పేశారు.

గతంలో నియోజకవర్గాల్లో నేతలు ఏవైనా చిన్నచిన్న తప్పులు చేసినా కేసీఆర్ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చూసీచూడనట్టు పోయేవారు. కానీ ఈ దఫా ఎన్నికలు కాస్త టఫ్ గానే ఉంటాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదనుకుంటున్నారు. దళితబంధులో కొంతమంది ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందిని ఈటీవల బహిరంగంగానే కేసీఆర్ వెల్లడించారు. ఇదే కాక, మరికొంతమంది నేతల అవినీతి కూడా తన వరకూ వచ్చిందని, అలాంటి వాళ్లు తీరు మార్చుకోకపోతే వాళ్లను మార్చక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మరి కేసీఆర్ వార్నింగ్ కు నేతలు భయపడతారా..? లేదా..? అనేది చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :