Radha Spaces ASBL

వేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్..! బీజేపీకి చిక్కులే..!?

వేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్..! బీజేపీకి చిక్కులే..!?

2024 సార్వత్రిక ఎన్నికలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చి మోదీకి బుద్ధి చెప్పాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితుల్లో ఇండియాటుడే – సీఓటర్ సర్వే ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని తేల్చింది. అయితే గత ఎన్నికలతో పోల్చితే సీట్లు భారీగా తగ్గుతాయని అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంటోందని సర్వే తేల్చింది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. దీన్ని బట్టి ఫలితాలు ఎటు వైపైనా మారే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీకి 284 సీట్లు వస్తాయని ఇండియా టుడే – సీఓటర్ సర్వే తేల్చింది. గత ఎన్నికలతో పోల్చితే ఇవి 19 తక్కువ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీగా లబ్ది పొందుతుందని సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 191 సీట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికలతో పోల్చితే ఇవి 139 ఎక్కువ. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో పుంజుకుందో అర్థమవుతోంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగం లేదని సర్వేలో తేలింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిలు బీజేపీపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని నింపుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ దాదాపు నాలిగింతలు లాభపడుతుందని అంచనా.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడు కూటములకు ఆస్కారం లేదు. కాంగ్రెస్, బీజేపీల కూటముల్లో ఇప్పటికే బీటలు వారాయి. ఎన్నికల నాటికి ఏ పార్టీ ఏ కూటమిలో ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదు. అయితే ప్రాంతీయ పార్టీలను కాజేయడంలో బీజేపీ ముందుంది. శివసేన, జేడీఎస్ లాంటి పార్టీలకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పైన కూడా బీజేపీ కన్నేసింది. ప్రాంతీయ పార్టీల్లోని అసంతృప్తులను సొమ్ము చేసుకుని లబ్ది పొందడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా.! కాబట్టి బీజేపీ అస్త్రశస్త్రాలను సంధించి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం వైపు వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. ప్రాంతీయపార్టీలన్నీ ఈ విషయాన్ని గమనించాలని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని పిలుపునిస్తోంది. బీజేపీ అంటే పొసగని కొన్ని పార్టీలు కచ్చితంగా కాంగ్రెస్ వైపే చూస్తాయి. బీజేపీ, కాంగ్రెస్ లను కాదని మూడో కూటమికి దేశంలో ఇప్పటికిప్పుడు ఆస్కారం లేదనేది విశ్లేషకుల మాట. అదే జరిగితే కాంగ్రెస్ వైపు బీజేపీయేతర పార్టీలు మొగ్గు చూపుతాయి. అప్పుడు బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :