యాపిల్ షాక్...

యాపిల్ షాక్...

భారత్‌లోని ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ ఊహించని షాకిచ్చింది. యాపిల్‌ ఐడీ ద్వారా సబ్‌స్క్రీప్షన్‌, యాప్‌ల కొనుగోలు కోసం భారత బ్యాంక్‌లు జారీ చేసిన డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులను యాపిల్‌ స్వీకరించడం లేదు. అంటే, యాప్‌ స్టోర్‌ నుంచి ఏదైనా యాప్‌ల కొనుగోలు లేదా ఐక్లౌడ్‌ ప్లస్‌, యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇంకా యాపిల్‌ సొంత మీడియాతో కంటెంట్‌ కొనుగోలుకు భారత బ్యాంకుల కార్డులతో చెల్లింపులు చేపట్టలేమిక. అంతే కాదు, యాపిల్‌ సెర్చ్‌లో ప్రచార కార్యక్రమాల కోసం భారత కార్డుల ద్వారా చెల్లింపుల స్వీకరణను కూడా జూన్‌ 1 నుంచి నిలిపివేయనున్నట్లు ఈ అమెరికన్‌ కంపెనీ తెలిపింది. ఆటో డెబిట్‌కు సంబంధించి గత ఏషడాది నుంచి ఆర్‌బీఐ ప్రవేశపెట్టి కొత్త నిబంధనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

 

Tags :