Radha Spaces ASBL

యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్

యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్

యాపిల్‌ యూజర్లకు టెక్‌ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్‌ పే ల్యాటర్‌ను లాంచ్‌ చేసింది.  ఈ సర్వీస్‌ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు ఉంది. ఈ సర్వీస్‌ ద్వారా ప్రోడక్ట్స్‌ కొనుగోలుపై యూజర్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో యూజర్లు చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పుడు కొని, తర్వాత చెల్లించడమనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా అమెరికన్ల కోసం యాపిల్‌ పే ల్యాటర్‌ను యాపిల్‌ లాంఛ్‌ చేసింది. ఆరు వారాల్లో నాలుగు వాయిదాల రూపంలో ఈ రుణాలను యూజర్లు తిరిగి చెల్లించవచ్చు. యాపిల్‌ పే పేమెంట్‌ పద్ధతిని ఆమోదించిన వ్యాపారుల నుంచి యూజర్లు ఈ లోన్స్‌ను ఆన్‌లైన్‌, యాప్‌ కొనుగోళ్ల కోసం తమ ఐఫోన్‌, ఐప్యాడ్‌లపై పొందవచ్చు.  ఇక ఈ చెల్లింపులను యూజర్‌ యాపిల్‌ వాలెట్‌ పర్యవేక్షిస్తుండటంతో యూజర్లు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఎప్పటికప్పుడు టాక్‌ చేసుకునే వీలుంది. యాపిల్‌ పే ల్యాటర్‌ ప్రీ రిలీజ్‌ వెర్సన్‌ను యాక్సెస్‌ చేసుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లను యాపిల్‌ ఆహ్వానిస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో రెండు నెలల్లో అర్హులైన యూజర్లందరికీ ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్‌ కసరత్తు సాగిస్తోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :