ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags :