Radha Spaces ASBL

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు.. తీర్పును

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు.. తీర్పును

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్‌ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారు. బెయిల్‌లపై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసుకు  సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే, ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. సీమెన్స్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంతా వెరిఫై చేయలేదని రాశారు. ఈ ఫోరెన్సిక్‌ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన వారే రిపోర్టులో చెప్పారు అని లూథ్రా వాదించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :