జగన్ అనుకున్నది ఒక్కటి..కోర్టు లో అయినది మరొక్కటి
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పరదాలు చాటును తిరిగిన జగన్ ఎప్పుడు తనకు భద్రత కావాలి అని కోర్టు తలుపులు తట్టారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన ఏపీ పోలీస్ శాఖ జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని స్పష్టం చేయడంతో పాటు ఆయన భద్రత తగ్గించాలని చేస్తున్న వాదనలో నిజం లేదు అని తేల్చి చెప్పింది.
ఈ విషయంపై స్పందించిన హైకోర్టు జగన్ భద్రతకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన జగన్ ఇప్పుడు తనకు ఓ ముఖ్యమంత్రి హోదాకి కల్పించిన సెక్యూరిటీని ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇదే విషయంపై ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే! 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా తనకు ఎటువంటి సెక్యూరిటీ అందించేవారు ఇప్పుడు తిరిగి అదే సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ జగన్ కోర్టు ఎక్కడంపై విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.
జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది శ్రీరాం.. ప్రస్తుత ప్రభుత్వం జగన్ కు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని కోర్టుకు తెలిపారు. అంతే కాదు జగన్ భద్రత కోసం ఒక జామర్ వెహికల్ కూడా ఇప్పించవలసిందిగా కోర్టును కోరారు. జగన్ తరఫున న్యాయవాది వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఇక దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్..ఈ విషయం పై అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రముఖుల భద్రత గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి జగన్ కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వరకు మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ అతను ఆశించినట్టు సీఎం రేంజ్ సెక్యూరిటీ అయితే వచ్చే సూచనలు కనిపించడం లేదు.