ASBL Koncept Ambience
facebook whatsapp X

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేతే చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారం (16వ తేది) కి వాయిదా పడింది. హైకోర్టులో సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి  వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్‌, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళల్లో సమస్యలున్నాయి. మధుమేహం అదుపులో ఉంది. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. మిగిలిన వాదనలు గురువారం వింటామని ధర్మాసనం తెలిపింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :