ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్అర్ఐ లకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు..

ఎన్అర్ఐ లకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు..

ఆటా ఎన్ ఆర్ ఐ కమిటీ ఏర్పాటు చేసిన బ్రేక్ ఔట్ సెషన్ లో మాట్లాడుతూ "అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ఎన్ ఆర్ ఐ లకు కనెక్ట్ అయి సేవలు అందించాలని చూస్తాయని, అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వుందని, కేవలం ఎన్ అర్ ఐ లకు సేవలు అందించడం కోసం APNRT Siciety లాంటి సంస్థ ఏర్పాటు చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే" అని APNRT ప్రెసిడెంట్, శ్రీ వెంకట్ మేడ పాటి అన్నారు.

శ్రీ వెంకట్ మేడపాటి AP NRT సొసైటీ గల్ఫ్ దేశాలలో వున్న ఎన్ అర్ ఐ లకు రోజువారీ అందిస్తున్న సేవలను, ఇతర దేశాలలో, ముఖ్యం గా అమెరికా లో వున్న ఎన్ అర్ ఐ లకు అందిస్తున్న వివిధ సేవలను వివరించారు. అమెరికా లో వున్న తెలుగు వారి సంఖ్య ను, వారికి ఆంధ్ర రాష్ట్రం మీద వున్న అనుబంధాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ అమెరికా నుంచి అనేకమంది ప్రభుత్వం లోకి తీసుకొని వారికి ప్రత్యేక బాధ్యతలు అప్ప చెప్పారని, అందరూ మీ సేవలోనే వున్నారని అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ లో ఎన్ అర్ ఐ విభాగం లో యడ్వైజెర్ గా వున్న శ్రీ సుబ్బా రావు చెన్నూరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టిందని, మొదటి విడత గా 200 దేవాలయాల కు ఒక సమగ్రమైన పోర్టల్ ఏర్పాటు చేసిందని, రెండవ విడతలో మరో 1500 దేవాలయాలు అందులోకి చేర్చ బడతాయని, వాటి ద్వారా భక్తులు వారు కొరుకొన్న లేదా నచ్చిన గుడి లో ఆన్ లైన్ ద్వారా పూజలు చేసుకోవచ్చని, ఇ హుండీ ద్వారా కానుకలు, ఇ డొనేషన్ ద్వారా విరాళాలు ఇవ్వచ్చని తెలిపారు. అదే విధంగా మా వూరు - మా గుడి పథకం ద్వారా భక్తులు వారికి నచ్చిన గుడి కి విరాళాలు ఇచ్చి అభివృద్ధి చేసుకొనే అవకాశం వుందని తెలిపారు.

ఆటా ఎన్ ఆర్ ఐ కమిటీ చైర్ శ్రీ శివ గీరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా న్యూ జెర్సీ రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ ఉపేంద్ర చివుకుల కూడా ఎన్ అర్ ఐ ల పాత్ర, ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఆటా పూర్వ అధ్యక్షులు శ్రీ కరుణాకర్ అసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీమతి మధూ బొమ్మినేని కూడా పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :