ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా.. తాము అండగా : చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందకుపైగా ఫైరింజన్లు సహాయక చర్యలో పాల్గొన్నాయని, పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా వేస్టేజ్‌ననఱు తరలిస్తున్నామని తెలిపారు.
సహాయచర్యల్లో 32 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారు. 179 సచివాలయాలకు 179 సీనియర్ అధికారులకు ఇన్‌ఛార్జులుగా పెట్టాం. ఎవరైనా చనిపోతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలిచ్చాం. మంగళవారం 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఇవాళ ఇప్పటి వరకు 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. 8.50 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించాం. 5 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశాం. గర్భిణిలకు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశాలిచ్చామన్నారు.