ASBL NSL Infratech
facebook whatsapp X

బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌కు.. అసెంబ్లీలో తీర్మానం : చంద్రబాబు

బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌కు.. అసెంబ్లీలో తీర్మానం : చంద్రబాబు

చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ ఆగ్రస్థానంలో కల్పించిన పార్టీ మాది. బీసీలు ఆది నుంచి పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం అన్నారు.  

చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు  జీఎస్టీ  తొలగించేందుకు ప్రయత్నిస్తాం.  జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్‌ చేస్తాం. నేతలన్నకలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తాం. చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తున్నా. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్‌ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేనేత కుటుబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తాం అని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏ శాఖలో చూసిన దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థల నిర్వీర్యమే కనబడుతోంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఏనాడు ఇన్ని ఇబ్బందులు చూడలేదు. వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి నిర్వీర్యమైంది. ఇబ్బందులు ఉన్నాయని ఇచ్చిన హామీలను వదిలిపెట్టలేదు. తొలి రోజే ఐదు సంతకాలు పెట్టాను. క్యాబినెట్‌లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నాం. వైసీపీ నేతలు ఐదేళ్లలో ప్రజల భూములు, ఆస్తులు కొట్టేశారు. రికార్డులు తారుమారు చేసి పేదలను అనేక ఇబ్బందులు పెట్టారు అని మండిపడ్డారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :